1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

ఎగ్ లెట్యూస్ సలాడ్

వంటకాలు చైనీస్ లెట్యూస్ క్యాబేజీ బటర్ పచ్చికొబ్బరి ముక్కలు కోడిగ్రుడ్లు మిరియాల పొడి ఉప్పు మొలక గింజలు స్వీట్కార్న్స్
కావలసిన పదార్థాలు :
తరిగిన లెట్యూస్ (క్యాబేజీ)... ఒక కప్పు
బటర్... ఒక టీస్పూన్
సన్నగా తరిగిన పచ్చికొబ్బరి ముక్కలు... రెండు టీస్పూన్లు
ఉడికించిన కోడిగ్రుడ్లు... రెండు
మిరియాలపొడి... ఒక టీస్పూన్
ఉప్పు... రుచికి తగినంత
ఏవేని మొలకెత్తిన గింజలు... మూడు టీస్పూన్లు
స్వీట్స్ కార్న్స్ (మొక్కజొన్న)... పావు కప్పు
తరిగిన ఉల్లిపాయలు... అరకప్పు
క్రీమ్... రెండు టీస్పూన్లు (అవసరం అనుకుంటేనే..)

తయారీ విధానం :

ముందుగా ఒక పాత్రలో వెన్న వేసి వేడయ్యాక తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, కొబ్బరితురుము, స్వీట్ కార్న్ వేసి కాసేపు వేయించాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, మిరియాల పొడి, క్రీమ్ వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాలపాటు అలాగే ఉడకనివ్వాలి.

చివరగా పై మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించేసి, ఆరబెట్టాలి. రెండుగా కోసి ఉంచుకున్న కోడిగ్రుడ్ల ముక్కలను ఈ మిశ్రమంలో కలిపి, పచ్చసొన విడిపోకుండా జాగ్రత్తగా కలపాలి. తరువాత మళ్లీ స్టవ్‌పై పెట్టి కాసేపు సిమ్‌లో ఉడికించిన తరువాత దించి, సర్వ్ చేయాలి. అంతే ఎగ్ లెట్యూస్ సలాడ్ రెడీ అయినట్లే..! దీన్ని చపాతీ, రోటీలలోకి సైడ్‌డిష్‌గా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి