1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

కైమా ప్రూట్ పంచ్

వంటకాలు చైనీస్ కైమా ప్రూట్ పంచ్ టొమోటో గుజ్జు పచ్చిమిర్చి వెన్న నూనె ఆపిల్ ముక్కలు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు
FileFILE
కావలసిన పదార్థాలు :
కైమా... ముప్పావు కేజీ
టమోటో గుజ్జు... నాలుగు పండ్లది
పచ్చిమిర్చి... నాలుగు
వెన్న, నూనె... నాలుగు టీస్పూన్లు

ఫ్రూట్ పంచ్ కోసం...
ఆపిల్ ముక్కలు... ఒకటిన్నర కప్పు
ఉప్పు... సరిపడా
అల్లం, వెల్లుల్లి పేస్ట్... తగినంత
లవంగాలు... ఎనిమిది
పసుపు, మసాలాపొడి, కారం, ఉప్పు... సరిపడా
ఉల్లిపాయలు... నాలుగు
అనాస ముక్కలు... రెండు కప్పులు
కమలాముక్కలు... రెండు
పావ్ (పావ్ బాజీలో వాడేవి)...మూడు

తయారీ విధానం :
కైమాను రెండు లేదా మూడుసార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి, నూనె వేసి బాగా కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కాసేపు వేగిన తరువాత టొమోటో గుజ్జు, మసాలా పొడిని కూడా వేసి వేయించాలి.

ఒక నాలుగు నిమిషాలపాటు వేగిన తరువాత కైమాను కూడా వేసి మెత్తగా ఉడికించాలి. ఇలా తయారైన కీమా కర్రీని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పావ్‌లను మధ్యకు ముక్కలుగా చేసుకోవాలి. మరో పొయ్యిపై పాన్‌లో వెన్న వేసి అందులో పావ్ స్లైసెస్ వేసి వేయించాలి. ఇవి ముదురు గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి.

అలాగే ఫ్రూట్స్ ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకుని, గ్లాసులో పోసి మూడు ఐస్‌క్యూబ్స్ వేయాలి. ఇందులో కాస్తంత ఉప్పు కూడా చేర్చాలి. ఇప్పుడు పైన తయారు చేసుకున్న కైమా కర్రీకి, వేయించిన పావ్ స్లైసెస్‌లను కలిపి.. ఫ్రూట్ పంచ్‌ను సైడ్‌డిష్‌గా సర్వ్ చేయాలి. అంతే కైమా ఫ్రూట్ పంచ్ రెడీ అయినట్లే...!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి