1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

క్రాబ్ క్రంచ్

వంటకాలు చైనీస్ క్రాబ్ క్రంచ్ ఎండ్రక్కాయలు మీగడ మసాలా దినుసులు టమోటో మిరియాలు గసగసాలు ఉల్లిపాయలు పసుపు
FileFILE
కావలసిన పదార్థాలు :
క్రాబ్ (ఎండ్రక్కాయలు) మాంసం... అరకేజీ
మీగడ... 50 మిల్లీలీటర్లు
మసాలా దినుసులు... ఒక టీస్పూన్
టమోటోలు... మూడు
మిరియాలు... అర టీస్పూన్
గసగసాలు... మూడు టీస్పూన్లు
ఉల్లిపాయలు..... రెండు
పసుపు... చిటికెడు
దాల్చిన చెక్క... సరిపడా
వెల్లుల్లి... రెండు పాయలు
చింతపండు గుజ్జు... తగినంత
వేరుశెనగనూనె... సరిపడా
కరివేపాకు, కొత్తిమీర... తగినంత
ఆవాలు, జీలకర్ర... తగినన్ని
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
మసాలా దినుసులు, గసగసాలు, దాల్చిన చెక్కలను కలిపి గ్రైండర్‌లో పొడిచేసుకోవాలి. క్రాబ్స్‌ను (ఎండ్రక్కాయలు) కడిగి శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి ఉడికించాలి. 10 నిమిషాలపాటు ఉడికిన తరువాత వీటిని కిందికి దించేసి నీటిని వంపేసి ఆరబెట్టుకోవాలి. ఆరిన తరువాత క్రాబ్స్‌ పైన ఉండే పెంకును పగులగొట్టి లోపలి మాంసాన్నంతా తీసి ఉంచుకోవాలి.

స్టవ్‌పై పాన్ పెట్టి అందులో రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, టమోటో ముక్కలు, కరివేపాకు లాంటివి వేసి వేయించాలి. దీంట్లోనే మసాలా పొడి, సరిపడా ఉప్పువేసి కలియబెట్టాలి. బాగా వేగిన తరువాత చింతపండు గుజ్జు, క్రాబ్స్ మాంసం వేసి బాగా కలపాలి. మాంసానికి మసాలా బాగా పట్టేంతదాకా వేయించాలి.

పదినిమిషాల పాటు అలా వేగిన తరువాత దాన్ని తీసి గిన్నెలో వేసి వెంటనే మీగడ కలపాలి. బాగా కలియబెట్టి పైన కొత్తిమీర తరుగును చల్లి అతిథులకు వేడి వేడిగా అందించండి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి