క్రీమ్ ఆఫ్ స్పైనాచ్
కావలసిన పదార్థాలు :
పాలకూర... పావుకేజీ
వెన్న... 30 గ్రాములు
పాలు... అర లీటర్
మిరియాల పొడి... ఒక టీస్పూన్
మైదాపిండి... 50 గ్రాములు
మీగడ... వంద గ్రాములు
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
ముందుగా పాలకూరను శుభ్రం చేసి, కడిగి, సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఒక బాణలిని స్టవ్‌పై పెట్టి, వేడయ్యాక తరిగి ఉంచిన పాలకూరను, కొద్దిగా ఉప్పు వేసి ఆవిరిమీద ఉడికించాలి. ఆకుకూర బాగా మగ్గి, నీరు బయటకు వచ్చేలా అనిపించిన తరువాత.. దాన్ని స్టవ్‌పై నుంచి దించి, ఆరబెట్టాలి. ఆరిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి.
ఇప్పుడు బాణలిలో వెన్న, మైదా పిండి వేసి గోధుమ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఆ తర్వాత అందులోనే పాలుపోసి గడ్డలు కట్టకుండా కలియబెట్టాలి. కాసేపు అలాగే వేడి చేసిన తరువాత దించేయాలి. చివరిగా అందులోనే నూరి ఉంచుకున్న పాలకూ గుజ్జు, మీగడ వేసి కలియబెట్టాలి. తరువాత సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలిపి వేడి వేడిగా వడ్డించాలి. అంతే క్రీమ్ ఆఫ్ స్పైనాచ్ రెడీ అయినట్లే...!