1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

గార్లిక్ మష్రూమ్స్

వంటకాలు చైనీస్ గార్లిక్ మష్రూమ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వెన్న ఉల్లిపాయలు వెల్లుల్లి బటన్ బ్రెడ్ కొత్తిమీర నిమ్మరసం ఉప్పు
కావలసిన పదార్థాలు :
సన్‌ఫ్లవర్ ఆయిల్... రెండు టీ.
వెన్న... నాలుగు టీ.
ఉల్లిపాయలు... ఐదు
వెల్లుల్లి రేకలు... మూడు
బటన్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు)... అర కేజీ
తాజా బ్రెడ్... 40 గ్రా.
కొత్తిమీర... ఒక కట్ట
నిమ్మరసం... రెండు టీ.
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... చిటికెడు

తయారీ విధానం :
ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. వెల్లుల్లి రేకల్ని మెత్తగా నూరాలి. బ్రెడ్ ముక్కల్ని సన్నగా పొడిలా చిదమాలి. తరువాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక.. వెన్న కూడా వేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఒకటి లేదా రెండు నిమిషాలపాటు వేయించాలి.

ఆ తరువాత పుట్టగొడుగులను వేసి నాలుగు లేదా ఐదు నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు చిన్న మంటమీద వాటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చివర్లో బ్రెడ్ పొడి, మిరియాలపొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి మరికొన్ని నిమిషాలపాటు ఉడికిస్తే... గార్లిక్ మష్రూమ్స్ సిద్ధమైనట్లే...! సింపుల్‌గా, సులభంగా తయారయ్యే ఈ వంటకాన్ని మీరూ ప్రయత్నించి చూస్తారు కదూ...!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి