1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

చైనీస్ పొటాటోస్

వంటకాలు చైనీస్ బంగాళాదుంపలు ఉల్లికాడలు అల్లం వెల్లుల్లి ఎర్రటి మిరపకాయలు పంచదార కార్న్ ఫ్లోర్ నూనె ఉప్పు సోయాసాస్
ND
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... పెద్ద సైజువి మూడు
ఉల్లికాడల తరుగు... రెండు టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి తరుగు... రెండు టీస్పూన్లు
ఎర్రటి మిరపకాయలు... మూడు
పంచదార... రెండు టీస్పూన్లు
కార్న్ ఫ్లోర్... రెండు టీస్పూన్లు
నూనె... మూడు టీస్పూన్లు
ఉప్పు... తగినంత
సోయాసాస్... రెండు టీస్పూన్లు
టొమోటో సాస్.... రెండు టీస్పూన్లు

తయారీ విధానం :
బంగాళాదుంపలను ఉడికించి పొట్టుతీసి ముక్కలు చేసుకోవాలి. ఫ్రయింగ్ పాన్ వేడి చేసుకుని, అందులో రెండు టీస్పూన్ల నూనె వేసి, బంగాళాదుంప ముక్కలను వేసి ఫ్రై చేయాలి. మిగిలిన నూనెను ఇంకొక పాన్‌లో వేసి, వేడిచేసి ఎర్ర మిరపకాయలు, అల్లం వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.

ఇప్పుడు పైన వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను కూడా ఎర్ర మిరపకాయలతో కలిపి వేయించాలి. అందులోనే ఉప్పు, పంచదార వేసి బాగా కరగనివ్వాలి. తరువాత కార్న్‌ఫ్లోర్ కలిపి, తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి. చివర్లో ఉల్లికాడల తరుగు పైన చల్లి... టొమోటో, సోయాసాస్‌లతో కలిపి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి