1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

మస్టర్డ్ ఫిష్ కర్రీ

వంటకాలు చైనీస్ రాహు చేప ఆవాలు ఆవనూనె పసుపు పచ్చిమిర్చి ఉప్పు శుభ్రం ముక్కలు ఐదు నిమిషాలు మస్టర్డ్ ఫిష్ కర్రీ బాణలి
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
ముళ్లు లేని పెద్ద చేప... అరకేజీ
ఆవాలు... వంద గ్రాములు
ఆవనూనె... ఐదు టీస్పూన్లు
పసుపు... ఒక టీస్పూన్
పచ్చిమిర్చి... మూడు
ఆవనూనె... చేపను వేయించేందుకు సరిపడా
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
చేపను బాగా కడిగి శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. వీటికి పసుపు, ఉప్పు పట్టించి ఐదు నిమిషాలపాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు బాణలిలో ఆవనూనె పోసి చేపముక్కలను ఎర్రగా వేయించాలి. తరువాత బాణలిలో ఎక్కువగా ఉన్న నూనెను తీసివేసి.. అందులోనే ఆవాలు, పచ్చిమిర్చిల ముద్దను వేసి వేయించాలి.

చివరగా ఆ మిశ్రమంలోనే ఓ కప్పు నీళ్ళు పోసి... వేడయిన తరువాత వేయించి ఉంచుకున్న చేపముక్కలను, సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత పైన ఆవనూనెను చల్లి రైస్‌తో కలిపి వడ్డించాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి