1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

సాసీ కాలీఫ్లవర్

వంటకాలు చైనీస్ కాలీఫ్లవర్ పాలు పీనట్ బటర్ ఉప్పు నెయ్యి మైదా
FileFILE
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్... ఒక కప్పు
మైదా... ఒకటిన్నర టీస్పూన్
పీనట్ బటర్... ముప్పావు టీస్పూన్
పాలు... పావు కప్పు
బటర్... ఒకటిన్నర టీస్పూన్
పీనట్స్... అరకప్పు
ఉప్పు... రుచికి సరిపడా
నెయ్యి... ఒక టీస్పూన్

తయారీ విధానం :
ముందుగా కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉప్పునీటిలో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తరువాత కాస్తం ఉప్పువేసి వాటిని ఉడికించాలి. ఈలోగా పాన్‌లో బటర్ వేసి కాగిన తరువాత మైదా వేసి కలపాలి. వేగిన పిండికి పీనట్ బటర్ వేసి కరిగించాలి. కరిగిన తరువాత పాలుపోసి కలుపుతూ పేస్ట్ లాగా చేయాలి.

వేరొక బాణలిలో ఒక టీస్పూన్ నేతిలో పీనట్స్ వేయించుకోవాలి. చివరగా ఉడికించిన కాలీఫ్లవర్, వేయించిన పీనట్స్ ముక్కలు, ఒక కప్పు నీరు, సరిపడా ఉప్పువేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికిన తరువాత పైన తయారు చేసుకున్న పేస్ట్ వేసి మరికాసేపు ఉడికించి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి