పండ్లను శుభ్రంగా కడుగుతున్నారా..?
పిల్లలకు పండ్లరసాలను తీసిస్తుంటారు చాలామంది. ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన మోతాదులో పీచు పదార్థం అందదు. అందుకే, పండును నేరుగా తినేయాలి. పిల్లలకూ అదే అలవాటు చేయాలి. దానిమ్మ, రేగు, నేరేడు, సీతాఫలం వంటివాటిని ముందే శుభ్రంగా కడిగి తినాలి. రేగుపళ్లను ముందుగా ఒలిచి పురుగులేకుండా చూసి స్వీకరించాలి.

