సంబంధిత వార్తలు
- భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా : ఐసీఎంఆర్
- రైతు ఆందోళనలు.. విదేశీ గళానికి చెక్.. భారత విదేశాంగ శాఖ స్పందన
- ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ.. జాక్ క్రాలే జారిపోయాడు..
- 5జీ ఆధారిత రియల్మీ X7 స్మార్ట్‌ఫోన్.. ధర రూ.19,999 నుంచి మొదలు
- ఆంధ్రప్రదేశ్‌లో 79 కరోనా కేసులు.. దేశంలో 19 రోజుల్లో 15లక్షల మందికి టీకాలు
దేశంలో మరో 12408 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా మరో 12408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 12,408 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేసమయంలో 15,853 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,02,591 కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 120 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,823 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,96,308 మంది కోలుకున్నారు. 1,51,460 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 49,59,445 మందికి వ్యాక్సిన్ వేశారు
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,99,31,795 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,15,776 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో 37,387 కరోనా పరీక్షలు నిర్వహించగా 169 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 189 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,270కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,91,699 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,607కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,964 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 780 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి.
తర్వాతి కథనం
