బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (18:28 IST)

దేశంలో లాక్‌డౌన్ తప్పదా.. ? నిపుణులు ఏమంటున్నారు..?

lockdown
చైనాలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించే అవకాశం వుందా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడదని.. ప్రజలు భయపడాల్సిన పరిస్థితి లేదని నిపుణులు వివరణ ఇస్తున్నారు. 
 
అయితే ఏమాత్రం ఏమరుపాటుగా వుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అక్కడిపరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా  భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నాయి.
 
ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ అవసరం లేదు. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్ డౌన్‌లు అవసరం లేదని చెప్తున్నారు. వీలైనంత మేర కోవిడ్  వ్యాప్తిని అడ్డుకోవడమే ఉత్తమమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.