సంబంధిత వార్తలు
- ‘క్యాచ్ అండ్ కిల్’ కరోనావైరస్: శాస్త్రవేత్తలు రెడీ చేస్తున్న ఎయిర్ ఫిల్టర్
- నోటికొచ్చినట్టు మాట్లాడితే అరెస్టుచేసి లోపల పడేస్తాం : విపక్ష నేతలకు తలసాని వార్నింగ్
- మరో అతి భయంకర ప్లేగు వ్యాధి.. చైనాలో 2 కేసులు నమోదు!
- దీనమ్మ కరోనా... అలా కూడా వ్యాపిస్తుందా? (video)
- ఖగోళ రహస్యం: ఓ రాకాసి నక్షత్రం చూస్తుండగానే మాయమైపోయింది, నిశ్చేష్టులైన శాస్త్రవేత్తలు
కరోనా వస్తే ఇన్ని ఇబ్బందులా..? మెదడుకు దెబ్బ.. గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తి.. జరజాగ్రత్త!!
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్న వేళ.. కరోనాతో పెను ప్రమాదం పొంచి వుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని చెప్పిన శాస్త్రవేత్తలు.. మరో షాకిచ్చే విషయం తెలిపారు. కోవిడ్-19 రోగుల్లో పలు రకాల మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని లండన్ పరిశోధకులు తాజాగా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. అంతేకాదు కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని, అంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లివర్‌పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కరోనా రోగుల్లో గుండె జబ్బులు, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత, మానసిక సమస్యలను కరోనాకు భారీగా ప్రభావితమైన దేశాలు నివేదించాయి.
ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. కరోనా సోకిన వారిలో దాదాపు వెయ్యి మంది రోగులు ఇలాంటి సమస్యలకు గురయ్యారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ సోకిన బాధితుల్లో మెదడులో ఇన్ఫెక్షన్ లేదా వాపు ముప్పు వున్నట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
