సంబంధిత వార్తలు
- నదీజలాలపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖాస్త్రం, తెలంగాణ ప్రజల మనో నివేదనం
- తెలంగాణలో కరోనా- 24 గంటల్లో కొత్తగా 2,009 కేసులు.. దేశంలోనూ కోవిడ్ ఉధృతి
- ఏపీలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు.. 41 మంది మృతి
- తుంగభద్ర నదికి పుష్కరాలు.. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1వరకు
- దేశంలో పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు - తెలంగాణాలోను అంతే...
తెలంగాణలో 2 లక్షలు దాటిన కోవిడ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు 2 లక్షలు దాటేశాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1335 పాజిటివ్ కేసుల నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,171కి చేరింది.
నిన్న 2,176 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,00,611కి చేరింది. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,72,388గా వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 27,052యాక్టవ్ కేసులు ఉన్నాయని, వారిలో 22,134మది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో 36,348మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసారు. ఇప్పటివరకు 32,41,597 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తర్వాతి కథనం
