మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 డిశెంబరు 2024 (16:51 IST)

అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Rape
చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో దారుణం జరిగింది. యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు చూస్తే... చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 23వ తేదీ రాత్రి తన స్నేహితుడితో కలసి మాట్లాడుతూ వుంది. ఆ సమయంలో అటుగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
 
వీరిని గమనించి దగ్గరకు వచ్చి విద్యార్థిని స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి తరిమి వేసారు. అనంతరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం ఆమెను అసభ్యంగా ఫోటోలు తీసి, తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి వదిలేసారు.
 
మరుసటిరోజు ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యూనివర్శిటీ ప్రాంగణంలోని సీసీ కెమేరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఒకడు రోడ్డు పక్కనే బిర్యానీ అమ్ముకునే జ్ఞానశేఖరన్ అని తెలుసుకుని అతడిని అరెస్ట్ చేసారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.