గురువారం, 16 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (10:52 IST)

చెన్నై కుర్రోడు.. 18 సంవత్సరాల వయసులోనే గుకేష్ అదుర్స్.. కొత్త రికార్డ్

Gukesh
Gukesh
చెన్నైలో జన్మించిన గుకేష్ కేవలం 18 సంవత్సరాల వయసులోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. డి గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అతను 14వ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు.
 
8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత FIDE అభ్యర్థుల చెస్ టోర్నమెంట్‌ను కూడా గెలుచుకున్నాడు. తద్వారా గుకేష్ అతి పిన్న వయస్కుడైన (17 సంవత్సరాలు) క్యాండిడేట్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. అతను 12 సంవత్సరాల వయస్సులో 2018లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. 
 
14 గేమ్‌ల ఈ మ్యాచ్‌లో గుకేశ్ అవసరమైన 7.5 పాయింట్లు సాధించి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత రెండో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత.. గత 10 ఏళ్లుగా ఈ విజయం కోసం కలలు కంటున్నానని, ఎట్టకేలకు దానిని సాధించానని గుకేశ్ చెప్పుకొచ్చాడు. గుకేష్ తండ్రి డాక్టర్ రజినీకాంత్, తల్లి పద్మ వృత్తిరీత్యా మైక్రోబయాలజిస్ట్.