1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Hyderabad: B.Tech Student Dies 18 Days After Marriage

వరకట్న వేధింపులు భరించలేక బీటెక్ వివాహిత మృతి

suicide
తెలంగాణ రాష్ట్రంలో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన 20 రోజులో ఆ యువతి భవనంపై నుంచి బలవన్మరణానికి పాల్పడింది. వరకట్న వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. 
 
మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు పల్లవి (20) ఘట్కేసర్‌లోని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఇదే మండలం చందేపల్లికి చెందిన బద్దం శ్రీకాంత్‌రెడ్డి హైదరాబాద్‌ చైతన్యపురి ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 
 
పల్లవిని వివాహం చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను శ్రీకాంత్‌ కోరారు. తమ వద్ద డబ్బులు లేవని వ్యవసాయ భూమిని అమ్మిన తర్వాత వచ్చే డబ్బులతో పెళ్లి చేస్తామని తెలిపారు. డబ్బులు అవసరం లేదని వివాహ ఖర్చులు తానే భరిస్తానని చెప్పి ఒప్పించాడు. ఆగస్టు 30న వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ సమీపంలోని మేడిపల్లిలో ఉంటున్నారు. పెళ్లికి రూ.20 లక్షల అప్పు అయ్యిందని, డబ్బులు కావాలని పల్లవిని వేధించాడు. 
 
కాటేపల్లికి వచ్చి అత్త, మామలను కట్నం కావాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. రెండు రోజులుగా పల్లవి కళాశాలకు వెళుతోంది. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి కళాశాల మూడో అంతస్తు నుంచి కిందికి వచ్చింది. సెల్‌ఫోన్‌ మరచిపోయానని స్నేహితులకు చెప్పి మూడో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకింది. మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సెప్టెంబర్ 20, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?