సంబంధిత వార్తలు
- బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్, లంచ్‌లో గ్రిల్డ్ చికెన్.. డిన్నర్లో సీఫుడ్స్ వుండాల్సిందే: కోహ్లీ
- వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయల్ని వేపుకుని తింటే..?
- ఒక గ్లాసుడు మజ్జిగలో నిమ్మరసాన్ని పిండుకుని తాగితే?
- అసలే వర్షాకాలం.. ఆహారంలో శుభ్రత అవసరం.. ఈ టిప్స్ పాటించండి
- నల్లటి వలయాలు, మచ్చలు పోవాలంటే.. మిరియాల పొడిని?
జలుబు, దగ్గును నయం చేసే చికెన్ రసం ఎలా చేయాలి?
ముందుగా మిక్సీలో ఉల్లి తరుగు, జీలకర్ర, మిరియాలు, జీలకర్ర, పసుపు పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను రుబ్బుకోవాలి. కుక్కర్లో రెండు స్పూన్ల నూనె పోసి కరివేపాకు.. రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి. ఆప
వర్షాకాలంలో చీటికి మాటికి జలుబు, దగ్గు వేధిస్తుందా? అయితే ప్రోటీన్లతో కూడిన చికెన్ రసాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తినండి అంటున్నారు వైద్యులు. చికెన్ బరువును నియంత్రిస్తుంది. ఇందులోని ప్రోటీన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి చికెన్‌తో బిర్యానీలు, ఫ్రైలు కాకుండా వెరైటీగా రసం ట్రై చేద్దాం..
కావలసిన పదార్థాలు :
చికెన్ - 250 గ్రాములు
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
అల్లం పేస్ట్- ఒక స్పూన్
మిరియాల పొడి- ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్
కొత్తిమీర పొడి - ఒక టీ స్పూన్
మిరప పొడి - అర టీ స్పూన్
పసుపు పొడి - ఒక టీ స్పూన్
టమోటా తరుగు - అర కప్పు
ఉప్పు, నూనె - తగినంత
కొత్తిమీర, కరివేపాకు తరుగు- పావు కప్పు
తయారీ విధానం :
ముందుగా మిక్సీలో ఉల్లి తరుగు, జీలకర్ర, మిరియాలు, జీలకర్ర, పసుపు పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను రుబ్బుకోవాలి. కుక్కర్లో రెండు స్పూన్ల నూనె పోసి కరివేపాకు.. రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి. ఆపై టమోటా తరుగు, శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు చేర్చి.. తగినంత నీరు, ఉప్పును చేర్చుకోవాలి. ఆపై కుక్కర్‌ను మూతపెట్టి చికెన్‌ను ఉడికించాలి. ఉడికాక దించేసి... కొత్తిమీర తరుగును చల్లి వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే జలుబు, దగ్గు మాయమవుతుంది. అంతే చికెన్ రసం రెడీ..
