టాటా లక్ష కారు కోసం ఎదురుచూపు
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మధ్యతరగతి వర్గం వారు కూడా కారును వినియోగించే అరుదైన అవకాశాన్ని అందిస్తామని రతన్ టాటా చెప్పిన మాటలు నిజం కానున్నాయి.
సుమారు రూ 3,700 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ లక్ష రూపాయల కారు పథకం కింద ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. 2008, జనవరి 10.... అంటే రేపే ఈ కారును ప్రదర్శించనున్నారు. దీంతో అందరూ టాటా లక్ష కారుకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద లక్షరూపాయలకే కారును మార్కెట్లో ప్రవేశపెట్టగలమని రతన్ చెప్పిననాటి నుంచే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
పూర్తిగా మధ్యతరగతి వారికోసం చేపట్టిన ఈ కారు పథకాన్ని... టాటా రెండేళ్ల క్రితం ప్రారంభించింది. కాగా, ఈ కారు మార్కెట్లోకి వస్తే తమ విక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారతీ కంపెనీ పేర్కొంది.
ఏది ఏమైనప్పటికీ దీని ప్రభావం మార్కెట్లో తప్పక ఉంటుందని.. ఇదొక అద్భుతమైన పథకం అని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. గురువారం టాటా మోటార్స్ ప్రగతి మైదానంలో ఈ కారు ప్రదర్శన ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.