1. వార్తలు
  2. »
  3. బిజినెస్
  4. »
  5. కథనాలు
  6. Usage

Electricity | Usage | KPMG | Executive director | Russia | Media | People | Manish agarwal | పెరగనున్న విద్యుత్‌ వినియోగం...!

విద్యుత్ వినియోగం
దేశంలో నానాటికీ విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది. దీంతో రానున్న పది సంవత్సరాల కాలంలో ఇది మరింత రెట్టింపవుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి ప్రతి గంటకు 600 టెరావాట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు.

కాగా వచ్చే దశాబ్దంలో ఇది మరింత రెట్టింపవుతుందని, ఇది రష్యా వినియోగాన్ని మించిపోనుందని బెంగుళూరులోనున్న ప్రముఖ పరిశోధనాసంస్థ కెపిఎంజి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌ తెలిపారు. బెంగుళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్‌కన్నా రానున్న మరో పది సంవత్సరాలలో ఇది మరింత రెట్టింపు కానుందన ఆయన వెల్లడించారు.

ఈ అదనపు విద్యుత్‌ సరఫరా కోసం దేశంలో మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 90 గిగావాట్లు పెరిగి 214 గిగావాట్లకు చేరుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇందుకుగాను అణువిద్యుత్‌, సౌరశక్తి, గ్యాస్‌తో పాటు చిన్నతరహా జల విద్యుదుత్పత్తి ప్రక్రియలను పెద్ద ఎత్తున చేపట్టాల్సి వుంటుందన్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ కంపెనీలు, ప్రజలకు విద్యుత్‌ సరఫరాను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలుచర్యలతోపాటు పెరుగుతున్న ఆర్థిక కార్యకాలాపాలు, సంపద, జనాభా, జీవన ప్రమాణాలు, మెరుగవుతున్న మౌలిక వసతులు వంటి పలు అంశాల కారణంగా విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగేందుకు దోహదపడుతున్నాయని ఆయన తెలిపారు.

2006 సంవత్సరంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 150 గిగావాట్లకు పెరిగిందని అదే 2000 సంవత్సరంతో పోలిస్తే ఇది 40 శాతం అధికమన్నారు.