'సత్యా'న్ని వధించిన 'రాజు'
|
ఇలా.. ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే ఐటీ కంపెనీ సత్యం కంప్యూటర్స్. ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుంది. సంస్థ ఛైర్మన్ బైర్రాజు రామలింగరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోతూపోతూ.. ప్రస్తుతం కంపెనీ ఉన్న స్థితిగతులను కళ్ళకు కట్టినట్టు వివరించారు. మనస్సులోని మాటను వెల్లడించారు. ఫలితంగా.. కంపెనీ రహస్యం ఒక్కసారి వెలుగులోకి వచ్చింది.
తన కుమారుడుకు సొంతమైన మేటాస్ ఇన్‌ఫ్రాను టేకోవర్‌చేసుకునే చర్యల్లో భాగంగా సత్యం అసలు రంగు బయటపడింది. గత నెల రోజుల కాలంలోనే సంస్థలోని లోపాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగుచూశాయి. చివరగా.. రాజు రాజీనామాతో ఒక్కసారిగా సత్యం క్లైమాక్స్‌కు చేరుకుంది.
రాజు రాజీనామాను సత్యం కంప్యూటర్‌స సర్వీసెస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. కంపెనీ తాత్కాలిక సిఈవోగా మైనంపాటి రామ్‌ను నియమించింది. సంస్థ ఉద్యోగులు, వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణకే తాను అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని రామ్ ప్రకటించారు. అయితే.. సత్యం సంస్థకు పోయిన పరువు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఐటీ విఫణిలో ఆయన నిలబెట్టగలడా? అన్నదే వేల డాలర్ల ప్రశ్న.
