ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ప్రైవేటు బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ఓ స్లీపర్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ఈ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి, ప్రయాణికులను అలెర్ట్ చేశాడు. ఆ సమయంలో బస్సులో 36...