1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
  4. What are the habits that damage the lungs

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

lungs
ఊపిరితిత్తులు ఆరోగ్యం సరిగా లేకపోతే వాటి కారణంగా ఎన్నో వ్యాధులు రావచ్చు. అందువల్ల వాటిని ఆరోగ్యంగా వుంచుకోవాలి. కొంతమంది అనుసరించే కొన్ని అలవాట్ల వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా వుండాలంటే తగినంత నీరు తాగుతుండాలి. అలా మంచినీళ్లు తాగనివారికి లంగ్స్ సమస్య తలెత్తవచ్చు.
పొగతాగటం వల్ల క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పలమనరీ డిసీజ్, లంగ్ కేన్సర్ రావచ్చు.
శుద్ధి చేసిన, బాగా వేయించిన పదార్థాలు తింటున్నా కూడా లంగ్స్ డ్యామేజ్ కావచ్చు.
వేరెవరో పొగతాగేవారి పక్కనే వుండి ఆ పొగను పీల్చినవారికి కూడా సమస్య రావచ్చు.
కాలుష్యం వున్నచోట మాస్కులు ధరించకుండా తిరగడం వల్ల కూడా లంగ్స్ డ్యామేజ్ కావచ్చు.
అన్ని కిటికీలు మూసుకుని నిద్రించడం వల్ల కూడా లంగ్స్ సమస్య ఉత్పన్నం అవుతుంది.
తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం మందగిస్తుంది.
 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?