పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. నల్లద్రాక్షలో మన శరీరానికి కావలసిన పోషకాలు చాలా ఉన్నాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడంలో ద్రాక్ష పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ద్రాక్ష రసం ఆరోగ్యానికే కాక చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు ద్రాక్ష రసం త్రాగడం వల్ల అందమైన, ప్రకాశవంతమై చర్మాన్ని సహజసిద్ధంగా పొందవచ్చు. ద్రాక్షలో విటమిన్ సి, ఎ, బి6,...