1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Brown rice, roti health benefits

బ్రౌన్ రైస్ ఫుడ్ బెస్ట్.. రోటీలను కాయగూరలు, ఆకుకూరలతో టేస్ట్ చేస్తే?

Brown rice
సాధారణ రైస్ కంటే బ్రౌన్ రైస్‌తో చేసిన అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రౌన్ రైస్, రోటీలతో పాటు కాయగూరలు, ఆకుకూరలతో చేసిన సబ్జీలు, కూరలు టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం తీసుకోవడం.. భోజనంలో రోటీలను భాగం చేసుకోవడం ద్వారా సమతులాహారం లభిస్తుంది.
 
గోధుమ పిండితో నూనె లేని రోటీలు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా సహకరిస్తుంది. రైస్ కంటే రోటీల్లో ఆరు రెట్లు అధికంగా ఫైబర్ ఉంటుంది. తద్వారా ఆకలి మందగిస్తుంది. అదే బియ్యంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహులకు ఇదే ఇబ్బందికరమైన అంశం. అదే గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి.
 
షుగర్ వ్యాధి ఉన్నవారికి గుండెజబ్బులున్న వారికి రోటీల మంచిది. అలాగే బరువు పెరగకుండా ఉండాలన్నా రోటీలు తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
About Writer
Selvi
తర్వాతి కథనం
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్.... నాక్కూడా వుందేమో...?! తెలుసుకునేదెలా..?!!