1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Green chillies health benefits

పచ్చిమిర్చి తినండి.. కంటి దృష్టిలోపాలు, ముడతలకు చెక్ పెట్టండి

పచ్చిమిర్చి తినండి.. కంటి దృష్టి లోపాలను, ముడతలను తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మిరప రెగ్యులర్‌గా తింటే.. వయసురీత్యా చర్మం మీద వచ్చే ముడతలు తగ్గుతాయి. కొన్ని రకాల వైరస్‌ల బారిన పడకుండా తప్

Green chillies health benefits
పచ్చిమిర్చి తినండి.. కంటి దృష్టి లోపాలను, ముడతలను తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మిరప రెగ్యులర్‌గా తింటే.. వయసురీత్యా చర్మం మీద వచ్చే ముడతలు తగ్గుతాయి. కొన్ని రకాల వైరస్‌ల బారిన పడకుండా తప్పించుకోవచ్చునని చెప్తున్నారు.

మిర్చికి ఎర్ర రక్తకణాలను వృద్ధిచేసే గుణం కూడా ఉంది. తద్వారా దృష్టిలోపాలు రావు. ఇందులోని విటమిన్‌ ఎ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది. పచ్చిమిర్చి "విటమిన్‌ సి"కి పెట్టింది పేరు. అరకప్పు తరిగిన పచ్చిమిర్చితో కనీసం 181 మిల్లీగ్రాముల ''సి'' విటమిన్‌ లభిస్తుంది. 
 
జీర్ణప్రక్రియను చురుగ్గా ఉంటే పచ్చిమిర్చి.. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా మిర్చి చేస్తుంది. హైపర్‌టెన్షన్‌కు గురికాని వారు అరుదు. కొన్ని రకాల క్యాన్సర్లకు పచ్చిమిర్చి రాకుండా చేస్తుందట. ఎముకలను పుష్టిగా ఉంచడంతోపాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల్ని దరి చేరనీయదు. విటమిన్ సి పుష్కలంగా రోగనిరోధకశక్తిని పెంపొందించే శక్తి పచ్చిమిర్చిలో ఉంది. చిన్నచిన్న అలర్జీలు, తుమ్ములు, దగ్గును తగ్గిస్తుంది.
About Writer
Selvi
తర్వాతి కథనం
పెదవులు మృదువుగా మారాలంటే.. కొత్తిమీర, క్యారెట్‌ జ్యూస్ కలిపి..?