బరువు తగ్గాలా? రోజూ ఓ కప్పు జామపండు ముక్కలు తినండి
బరువు తగ్గాలా? రోజూ ఓ కప్పు జామపండు ముక్కలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కప్పు జామ పండు ముక్కల్లో 112 కెలొరీలుంటాయి. ఒక కప్పు ముక్కలు తీసుకుంటే రోజుకు సరిపడా పీచు అందుతుంది. అంతేకాదు సహజ చక్కెర్
బరువు తగ్గాలా? రోజూ ఓ కప్పు జామపండు ముక్కలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కప్పు జామ పండు ముక్కల్లో 112 కెలొరీలుంటాయి. ఒక కప్పు ముక్కలు తీసుకుంటే రోజుకు సరిపడా పీచు అందుతుంది. అంతేకాదు సహజ చక్కెర్లూ ఉంటాయి. వెంటనే పొట్టనిండిన భావన కలుగుతుంది. డైటింగ్ చేసే వారు తప్పనిసరిగా తీసుకుంటే మంచిది. దీంతో బరువు కూడా ఈజీగా తగ్గుతుంది.
అలాగే పచ్చి బఠాణీల్లో పీచూ, విటమిన్లూ, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. కప్పు బఠాణీల్లో అరవై నాలుగు కెలొరీలుంటాయి. కాబట్టి వీటిని అన్నం లేదంటే, పుల్కా, చపాతీతో తీసుకోవచ్చు. బఠాణీల్లో లభించే పోషకాలన్నీ బరువును తగ్గించడానికి ఎంతో దోహదం చేస్తాయి.
దాల్చిన చెక్క కూడా బరువు తగ్గడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేస్తాయి. అయితే దాల్చిన చెక్క టీ తీసుకున్నప్పుడు నూనె పదార్థాలను దగ్గరకు రానివ్వకూడదు. అలా చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇకపోతే.. తీసుకొనేది కొద్దిపాటి ఆహారమే అయినా అందులోకి క్యాలీఫ్లవర్‌తో కూర, వేపుడు ఏదో ఒకటి ఉండేలా చూసుకోండి. కప్పు క్యాలీఫ్లవర్‌లో రెండు గ్రాముల పీచు, 27 కెలొరీలు ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. ఈ పోషకాలు బరువును అదుపు చేస్తూ జీవక్రియ రేటును సమతుల్యం చేస్తాయి.
