1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. walnuts milk smoothie Health Benefits

ఉదయం పూట పాల పదార్థాల స్మూతీలో వాల్‌నట్స్, బాదం పలుకులు చేర్చి తీసుకుంటే?

వాల్‌నట్స్, బాదం పలుకుల్ని పొద్దుటే పెరుగు, పాల పదార్థాలూ, పండ్లను కలిపి స్మూతీలా తయారు చేసి తీసుకుంటే రోజంతా చురుగ్గా ఉంటారు. ఇంకా బరువు తగ్గుతారు. వాల్‌నట్స్, బాదంలో మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు, ఒమెగా

walnuts milk smoothie Health Benefits
వాల్‌నట్స్, బాదం పలుకుల్ని పొద్దుటే పెరుగు, పాల పదార్థాలూ, పండ్లను కలిపి స్మూతీలా తయారు చేసి తీసుకుంటే రోజంతా చురుగ్గా ఉంటారు. ఇంకా బరువు తగ్గుతారు. వాల్‌నట్స్, బాదంలో మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికం. వీటిని ఉదయం తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది. కొవ్వు తగ్గి, కెలొరీలూ ఖర్చవుతాయి.
 
అలాగే ఉదయం పూట అల్పాహారంగా రాగి జావ చాలా మంచిది. ఇందులో క్యాల్షియం, ఇనుము ఎక్కువగా ఉంటుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండటమే కాదు, రక్తహీనతా దూరమవుతుంది. ఇందులో బెల్లం, యాలకులతోపాటు. వెన్నలేని పాలు కూడా వేసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా ఆకలీ వేయదు.
 
ఇక ఉదయాన్నే పీచు సమృద్ధిగా లభించే ఓట్స్‌ తింటే బరువు తగ్గడమే కాదు, ఆరోగ్యానికీ మంచిది. దాన్ని వెన్నలేని పాలతో చేసుకోవాలి. అప్పుడే కెలొరీలు కరుగుతాయి. అందులో అరటిపండు ముక్కలూ, కొన్ని ఎండు ద్రాక్ష పలుకులూ, నానబెట్టి పొట్టుతీసిన బాదం గింజలు వేసుకోవచ్చు. ఇది తీసుకుంటే.. బలానికి బలం.. ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
About Writer
Selvi
తర్వాతి కథనం
చలికాలంలో దాల్చిన చెక్కపొడి, తేనె మిశ్రమంతో గొంతునొప్పికి చెక్..