1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. These health Precautions must be followed to protect the liver

కాలేయాన్ని కాపాడుకునేందుకు ఇవి పాటించడం తప్పనిసరి

health Precautions
లివర్ డ్యామేజ్ అయితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే లివర్ పాడవకుండా మనం రక్షించుకోవచ్చు. అవేంటో చూద్దాం. రాత్రి పూట త్వరగా పడుకుని ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివ‌ర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవ‌చ్చు. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. 

 
అంతేకాకుండా ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేయకూడదు. లేదంటే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మోతాదుకి మించి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా లివర్‌పై అధిక భారం పడుతుంది. కొద్దికొద్దిగా అప్పుడప్పుడూ ఆహారం తీసుకుంటే మంచిది. వైద్యుల సలహా లేకుండా మనకిష్టమొచ్చినట్లు మందులు వాడినా లివర్ చెడిపోతుంది. 

 
డాక్టర్‌లు సూచించిన మోతాదులలో మాత్రమే మందులు వాడాలి. కలుషితమైన నూనెతో చేసిన ఆహారాన్ని తిన్నా కూడా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. రిఫైన్డ్ ఆయిల్ వాడటం శ్రేయస్కరం. మద్యానికి బానిసైన వారిలో కూడా చాలా మందికి లివర్ పాడైపోతుంది. సాధ్యమైనంత వరకూ మద్యానికి దూరంగా ఉండటమే మంచిది. ఆహారాన్ని బాగా ఉడికించి తినాలి. పచ్చిపచ్చిగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అది జీర్ణమవదు. లివర్‌పై భారం పడుతుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
మెంతి ఆకుల రసంలో తేనె కలిపి తాగితే ఏమవుతుంది?