1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. What are 5 ways to prevent acidity

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

Acidity
చాలా మందికి తిన్న ఆహారం జీర్ణంకాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలితే అసిడిటీ క్రమంగా తగ్గుతుంది. 
భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు. 
తులసి ఆకులను మూడు పూటలా భోజనానికి ముందు నమలుతుంటే అసిడిటీ రాకుండా చూసుకోవచ్చు.
భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి. దీని వల్ల అసిడిటీ తగ్గుతుంది. 
భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అసిడిటీ రాదు. 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్