1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. Onion is best to avoid sleeplessness in children

ఉల్లితో పిల్లల్లో నిద్రలేమి దూరం

Onion
చిన్నపిల్లలు ఒక్కొక్కసారి విపరీతంగా ఏడుస్తుంటారు. ఏమైందో చెప్పుకోలేరు. వాళ్లు నిద్రపోరు. మనల్ని నిద్రపోనివ్వరూ. తెల్లవార్లు జాగారం చేయాల్సి ఉంటుంది. ఏ కడపునొప్పో, చెవినొప్పనని మనం హైరానా పోతుంటాం. నిద్రలేమి కారణంగా కూడా ఏడుస్తుంటారు. అదే సమయంలో పడుకున్న వారు ఓ పట్టాన నిద్రపోరు పొర్లిన వారు పొర్లుతూనే ఉంటారు. ఏమైందో ఏమోనని మనం హైరానా పడుతుంటాం. ఇలాంటి నిద్రలేమి సమస్యతో పిల్లలు మనకు ఆందోళన కలిగిస్తుంటారు. మనం ఏం చేయాలి? 
 
ఈ సమస్యకు ఉల్లితో చక్కని పరిష్కారం లభిస్తుంది. 50 గ్రాములు ఉల్లి తరుగును అంటే తురిమిన ఉల్లిని 100 మి.లీ. నీటిలో వేసి 5 నుంచి 6 నిమిషాల వరకూ సన్నని మంట మీద మరగించాలి. ఈ విధంగా ఏర్పడిన కషాయాన్ని వడపోయాలి. అనంతరం ఒక చెంచాడు తీసుకుని అందులో 5 లేదా 6 చుక్క తేనె వేసి పిల్లలకు పట్టించాలి. పిల్లలు నిద్రలేమి పోయి చక్కగా నిద్రపోతారు.
 
About Writer
pyr