1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. What are the health tips to reduce sunburn

వడదెబ్బ తగిలితే తగ్గేందుకు ఆరోగ్య చిట్కాలు ఏమిటి?

heat stroke treatment at home
వేసవి ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము.
 
ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. 
జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి.
ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.
మజ్జిగ తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
కీరదోస ముక్కల్ని రెండుపూటలా తినటం వల్ల దీనిలో ఉండే పోషకాలు డీహైడ్రేషన్‌ను దరిచేరనీయవు.
శరీరంలో నీటిశాతం తగ్గకుండా వుండేందుకు పుచ్చకాయ, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి.
సలాడ్స్, తాజా కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
9 గంటలకు మించి అతినిద్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందా?