ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (09:03 IST)

వడదెబ్బ తగిలి వరుడు మృతి.. ఎక్కడ?

marriage
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం వడదెబ్బ తగిలి వరుడు మృతి చెందాడు. తెలంగాణలోని కొమరం భీం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన శ్యాంరావ్- యశోద దంపతుల పెద్దకుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. 
 
బుధవారం పెళ్లి ముహూర్తం కోసం అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కానీ తిరుపతికి మంగళవారం వడదెబ్బ తగిలింది. దీంతో అతనిని ఆస్పత్రిలో చేర్చారు. 
 
కానీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. తిరుపతి మృతి చెందాడు. మరికొద్ది గంటల్లో పెళ్లనగా వడదెబ్బ కారణంగా వరుడు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.