1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. హోమియోపతి
  6. Ayurvedic Tips

Cold | Ayurvedic Tips | జలుబుకు ఆయుర్వేద చిట్కాలు

జలుబు
FILE
చాలామందిని తరచుగా వేధించే అనారోగ్య సమస్య జలుబు. అలా వాన చినుకుల్లో తడిస్తే చాలు పట్టుకుంటుంది పడిశము. దీనిని వదిలించుకునేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం.

* వేడి నీటిలో పసుపు వేసి ఆ నీరును ఆవిరి పట్టించిన చెమటపట్టి పడిశం నశిస్తుంది.
* నిప్పులలో పసుపుకొమ్ము వేసి ఆ పొగను పీల్చుతున్నట్లయితే జలుబు తగ్గుతుంది.
* తేనెతో మిరియాల పొడి కలిపి తిన్నట్లయితే పడిశము తగ్గుతుంది
* పొగడపువ్వులను ఎండబెట్టి పొడిచేసి నశ్యములా పీల్చినట్లయితే జలుబు తగ్గుముఖం పడుతుంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి