శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (16:28 IST)

రాత్రంతా వేశ్యతో డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేశాడు.. తెల్లారేసరికి?

థాయ్‌లాండ్ టూరిస్ట్ ప్రాంతమైన పటాయాలో దారుణం చోటుచేసుకుంది. రాత్రంతా సెక్స్ వర్కర్‌తో ఎంజాయ్ చేసిన ఓ పర్యాటకుడు ఆమెను హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. నార్త్ ఐర్లాండ్‌కి చెందిన ఓ విదేశీ టూరిస్ట్ వేశ్య కోసం రాత్రి పది గంటల సమయంలో పటాయా బీచ్ సమీపంలో ఉన్న సావో బుకావో ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ విటుల కోసం వేచిచూస్తున్న సెక్స్ వర్కర్ల నుంచి ఆన్ అనే మహిళను సెలెక్ట్ చేసుకుని తన బంగ్లాకి తీసుకెళ్లాడు. 
 
డ్రగ్స్ మరీ ఇచ్చి సెక్స్ వర్కర్‌తో శృంగారంలో పాల్గొన్నాడు. డ్రగ్స్ తీసుకున్న ఇద్దరూ రాత్రంతా ఎంజాయ్ చేశారు. ఉదయాన్నే ఇద్దరి మధ్య వివాదం జరగడంతో సెక్స్ వర్కర్‌ని టూరిస్ట్ దారుణంగా చంపేశాడు. స్నూకర్ క్యూతో తలపై కొట్టడంతో కింద పడిపోయిన ఆమెను రెండడుగుల పొడవున్న కత్తితో దారుణంగా నరికేశాడు. బాత్రూమ్‌లో పడేసి దారుణంగా చంపేశాడు.
 
అనంతరం బంగ్లాను వదిలేసి పారిపోతూ బైక్‌ని ఢీకొట్టడంతో పోలీసులు టూరిస్ట్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సెక్స్ వర్కర్ వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని.. బాత్రూమ్‌లో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పటాయా పోలీసు అధికారి సొంగ్‌హంగ్ తెలిపారు. సెక్స్ వర్కర్ పేరు ఆన్ అని.. నిందితుడి పేరు ఎలియెట్ అని తెలిసింది. ఇతడు కవాస్కీ రేసింగ్ టీమ్‌లో పనిచేస్తున్నాడని తేలింది.