శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 23 డిశెంబరు 2019 (22:20 IST)

రసపట్టులో రెండు జంటలు.. బట్టలేసి అరెస్టు చేసిన పోలీసులు

బీహార్ నైనీ ప్రాంతంలో గల ఏడీఏ కాలనీ పరిధి మనస్‌నగర్ పీఏసీ కాలనీ గేట్ సమీపంలోని రోషన్ అనే వ్యక్తి అద్దెంట్లో నివాసముంటున్నాడు. ఇటీవల అతడి ఇంటికి అపరిచిత వ్యక్తులు బైకులు, కార్లలో వచ్చి వెళ్తుండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆదివారం ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆ సమయంలో రెండు వేర్వేరు గదుల్లో జంటలు శృంగారంలో మునిగి తేలుతున్నాయి. పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చి దుస్తులు వేసి జీపులో ఎక్కించారు. ఇద్దరు విటులను స్టేషన్‌కు తరలించి, వ్యభిచారులను రెస్క్యూ హోమ్‌కి తరలించారు.
 
రోషన్ చాలా ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో సులభంగా డబ్బులు సంపాదించేందుకు అతడు ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన ఇద్దరు వ్యభిచారులు బిహార్‌లోని పాట్నాకు చెందిన వారని వెల్లడించారు. అత్యంత రద్దీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నిర్వహించడం పట్ల పోలీసులు షాకవుతున్నారు.
 
రోషన్ ఒక్కడే ఈ దందా నిర్వహిస్తున్నాడా? లేక అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వ్యభిచారం కేంద్రం నిర్వహణలో ఇంటి యజమాని కొడుకు పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు.