సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (10:15 IST)

పోలీసు బూట్లు నాకిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్

తమ పార్టీ అధికారంలోకి వస్తే తమ బూట్లు కానే పోలీసులను విధుల్లో నియమించుకుంటామంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం తన నిరసనను వ్యక్తం చేశారు. పైగా, పోలీసు బూట్లను ముద్దుపెట్టుకున్నారు. 
 
ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, దేశ రక్షణకు పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని, అలాంటి వారిపై జేసీ జుగుప్సాకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలామాట్లాడితేనే ప్రజలు రాజకీయంగా సమాధి కట్టారని చెప్పారు. జేసీ అలా మాట్లాడుతుంటే దుర్యోధనుడిలా టీడీపీ అధినేత చంద్రబాబు నవ్వారని విమర్శించారు.
 
అహర్నిశలు చమటోడ్చి సమాజం కోసం పని చేస్తున్నది పోలీసులని చెప్పుకొచ్చారు. గతంలో మీపై నేను ఒక్కసారి మీసం తిప్పితే ఎంపీ అయ్యాను.. మీరు బజారున పడ్డారు. గతంలో పోలీసులను తిట్టినందుకే పతనావస్థకు చేరావు.. మీ పిల్లలకు అదే పరిస్థితి వచ్చింది. 
 
ఒక పోలీస్‌గా నేను ట్రైల్ వేస్తే ఎంపీనయ్యా, పోలీసు అనుకుంటే ఏదైనా చేయగలరు. జేసీ అంత నీచంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నవ్వుతున్నారు.  దుర్యోధన చక్రవర్తిలా నవ్వుతారా.. మీకు మనసు లేదా, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యావ్.. ఇంత వయసు వచ్చింది.. ఎందుకు జేసీ ఆప లేదు.