గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (10:03 IST)

డబ్బు కోసం అడ్డదారులు.. జూనియర్ ఆర్టిస్టుల వ్యభిచార కేంద్రం

హైదరాబాద్ నగరంలో జూనియర్ ఆర్టిస్టులు వ్యభిచార కేంద్రాన్ని గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు విటుల రూపంలో వచ్చిన ఈ వ్యభిచార కేంద్ర గుట్టును రట్టుచేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు అదనపు సంపాదనకోసం అక్రమ మార్గం పట్టారు. ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. 
 
సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడు పారిపోగా మరొకరిని అరెస్టు చేశారు. కిరణ్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటకు చెందిన ఇంటి పవన్‌ సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌లుగా పనిచేస్తున్నారు. అదనపు సంపాదన కోసం వ్యభిచార గృహం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 
 
ఖైరతాబాద్‌ రాజ్‌నగర్‌లో గత ఏడాది డిసెంబర్‌లో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇరుగుపొరుగువారు వచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేయగా కిరణ్‌ పారిపోగా పవన్‌(24)ను అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌, రూ.2 వేలు స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు.