శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (11:02 IST)

అత్తతో అల్లుడు అక్రమ సంబంధం ... నవ వధువు ఆత్మహత్య

అత్తతో అల్లుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబురావుతో విడిపోయి.. క్యాటరింగ్‌ పనులు చేస్తూ పిల్లలతో కలిసి ఉంటోంది. 
 
ఈ క్రమంలో ఆమెకు ప్రేమ్‌ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు తరచూ అనిత ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఎలాగైనా శాశ్వతంగా ఇద్దరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే తన పెద్ద కుమార్తె వందన(19)ను నవీన్‌ కుమార్‌కు ఇచ్చి అనిత గత యేడాది డిసెంబరు ఒకటో తేదీన వివాహం జరిపించింది.
 
కుమార్తెకు వివాహమైన తర్వాత కూడా అనితలో మార్పు రాలేదు. నవీన్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఇది గమనించిన వందన విడిగా ఉందామని పలుమార్లు భర్తకు చెప్పగా, ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానని తల్లి అనిత బెదిరించసాగింది. 
 
వీరిద్దరి ప్రవర్తన కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి సూసైడ్‌ నోట్‌ రాసి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి సోదరి సంజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.