1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. China's President Xi Jinping reappointed with no term limits

చైనా శాశ్వత అధ్యక్షుడుగా జిన్ పింగ్.. వ్యతిరేకంగా ఒకే ఒక్క ఓటు

చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్ పింగ్ ఎంపికయ్యారు. ప్రపంచంలో రెండో అతిపద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు.

China's President
చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్ పింగ్ ఎంపికయ్యారు. ప్రపంచంలో రెండో అతిపద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే ఆయన ఐదేళ్లపాటు అధ్యక్ష పాలన పూర్తి చేసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం రెండు సార్లకే అధ్యక్షుడిగా అవకాశం ఉంది. అంటే ఈ ప్రకారం 2023 వరకే ఆయన పాలనకు అవకాశం.
 
కానీ, శాశ్వతంగా (చిరకాలం) పాటు జిన్ పింగ్ అధ్యక్షుడిగా ఉండేందుకు అక్కడి పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించిన విషయం తెలిసిందే. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు కాల పరిమితిని ఎత్తేసింది. ఇందుకు అనుగుణంగా జిన్ పింగ్‌ను మరోసారి అధ్యక్షుడిగా పార్లమెంట్ శనివారం ఎన్నుకుంది. 
 
2,970 ఓట్లలో ఒక్క ఓటు మినహా మిగిలినవన్నీ జిన్ పింగ్‌కు అనుకూలంగా పడినవే. జీవించి ఉన్నంత కాలం ఇక అధ్యక్ష పీఠం ఆయనకే సొంతం. ఉపాధ్యక్షుడిగా వాంగ్ కిషన్‌ను అధ్యక్షుడు ప్రతిపాదించారు. దీంతో ఉపాధ్యక్షుడిగా వాంగ్ సైతం నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పుట్టింటి నుంచి డబ్బు తెస్తేనే నీతోగడుపుతా... తేల్చి చెప్పిన భర్త : రేప్ కేసు పెట్టిన భార్య