1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Corona virus cases America

కరోనా అమెరికాలో విలయతాండవం.. 81వేల కరోనా కేసులు

Corona virus
చైనాలో పుట్టి ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్.. అగ్రరాజ్యం అమెరికాలో విలయతాండవం చేస్తోంది. అమెరికాలో ఈ వైరస్ ఎంతలా వ్యాపించిందంటే.. ఈ విషయంలో చైనాను అమెరికా దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 81వేల కరోనా కేసులు నమోదవగా.. అమెరికాలో ఈ సంఖ్య 85వేలు దాటేసింది. మృతుల సంఖ్య కూడా ఇక్కడ 1000 దాటింది. 
 
ఇకపోతే.. మూడోస్థానంలో ఇటలీ ఉంది. ఇటలీలో 80వేలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే 5,32,263 మందికి సోకింది. వీరిలో 24,090 మంది మృత్యువాతపడ్డారు. 1,24,349 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. ఇదిలా ఉంటే.. స్పెయిన్‌‌లో 57786 కేసులు నమోదవ్వగా.. 4365 మంది మృ తి చెందారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఆ రుణాలకు మాత్రమే మారటోరియం : క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాల్సిందే : ఆర్బీఐ