గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (09:52 IST)

గర్ల్‌ఫ్రెండ్‌తో భర్త శృంగారం... చీటింగ్‌ను బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫోటో

తన భార్యను మోసం గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ శారీరకంగా కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఓ భర్త బండారాన్ని ఫేస్‌బుక్ ఫోటో బయటపెట్టింది. సింగపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.

భార్యను మోసం గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ శారీరకంగా కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఓ భర్త బండారాన్ని ఫేస్‌బుక్ ఫోటో బయటపెట్టింది. సింగపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మలేషియాకు చెందిన అమందా చొంగ్ కాహ్ మూన్ అనే మహిళకు ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే, వివాహమైన కొన్ని నెలలకు భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనకు నమ్మక ద్రోహం చేస్తున్నాడనే విషయాన్ని గ్రహించింది. దీంతో అతనిని నిత్యం గమనిస్తూ వచ్చింది.
 
ఈ క్రమంలో భర్త ఫేస్‌బుక్ ఖాతాను పరిశీలించసాగింది. ఒక రోజున ఈ ఖాతాలో ఒక యువతి నుంచి వచ్చిన పోస్టు అమందాను ఆలోచింపజేసింది. ఆ యువతితో భర్త తిరుగుతున్నాడనే అనుమానం కలిగింది. ఈ ఫొటోలో బ్రాలెస్ డ్రెస్ ధరించిన ఒక యువతి వెనుక ఒక యువకుడు ఉండటం గమనించింది. ఆ ఫోటోలో వున్న వ్యక్తి ముఖం కనిపించకుండా ఉంది. ఆ యువకుడు ధరించిన దుస్తులు గమనించగానే... అమందాకు అతను తన భర్తే అని తెలిసింది. 
 
ఆ తర్వాత తాను థాయ్‌ల్యాండ్ వెళుతున్నానని చెప్పిన భర్త.. తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకుని వెళ్లి ఎంజాయ్ చేశాడు. రెండు మూడు రోజుల తర్వాత భర్త ఇంటికి తిరిగివచ్చాడు. తన అనుమానం నిజం కావడంతో భర్తను నిలదీసింది. భర్త నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. 
 
తన భర్త థాయ్‌ల్యాండ్ వెళుతున్నప్పుడు సోషల్ సైట్‌లో అమందా అతనితో టచ్‌లోనే ఉంది. తర్వాత భర్త... ఆమె మెసే‌జ్‌లకు జవాబు ఇవ్వడం మానేశాడు. తన అన్ని సోషల్‌సైట్ అకౌంట్‌లను బ్లాక్ చేశాడు. అనుమానం వచ్చిన అమందా.. భర్త పనిచేసే ఆఫీస్‌కు వెళ్లింది. అక్కడ భర్త ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఒక ఫొటో కనిపించింది. దీంతో భర్త బండారం బయటపడింది.