మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (09:33 IST)

ఆదేశాలు లైట్‌గా తీసుకున్నారు... రూ.235 కోట్లు బాదేసిన ఎస్.బి.ఐ

ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తన ఖాతాదారులను నిలువుదోపిడీకి పాల్పడింది. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) మొత్తం లేదన్న సాకుతో ఎడాపెడా అదనపు చార్జీలను వ

ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తన ఖాతాదారులను నిలువుదోపిడీకి పాల్పడింది. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) మొత్తం లేదన్న సాకుతో ఎడాపెడా అదనపు చార్జీలను వసూలు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకంగా వందల కోట్లు వసూలు చేసింది. 
 
ఖాతాదారులు తప్పకుండా తమ బ్యాంకు అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌ను ఉంచుకోవాలని, లేకుంటే జరిమానా తప్పదని గతంలో ఎస్.బి.ఐ హెచ్చరించిన విషయం తెల్సిందే. అయితే, బ్యాంకు ఆదేశాలను లైట్‌గా తీసుకున్న వారి నుంచి ఎస్బీఐ ఏకంగా రూ.235.06 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. 
 
తొలి త్రైమాసికంలో మొత్తం 388.74 లక్షల ఖాతాల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్టు తెలిపింది. ఆర్టీఐ చట్టం ద్వారా ఓ వ్యక్తి దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించిన ఎస్‌బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.