బూడిద కుప్పగా మారిన హవాయి ద్వీపం.. 70మంది మృతి
Hawaii fire
శతాబ్ధాల చరిత్ర కలిగి, భూతల స్వర్గంగా పేరుగాంచిన హవాయి ద్వీపంలో ఎటు చూసినా కాలిపోయిన మృతదేహాలు కనిపిస్తున్నాయి. హరికేన్ ప్రభావంతో బలమైన గాలుల కారణంగా మంటలు క్షణాల్లో నగరమంతా విస్తరించాయి.
మంగళవారం రాత్రి ఈ కార్చిచ్చు నగరమంతా విస్తరించింది. కార్చిచ్చు కారణంగా వేలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు. హవాయి చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద విపత్తు అని అధికారులు ప్రకటించారు.
