శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (12:16 IST)

Solar Eclipse 2023 Live Updates: సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్

Solar Eclipse 2023
Solar Eclipse 2023
సూర్యగ్రహణం 2023 నేడు ఏర్పడింది. ఈ హైబ్రిడ్ సూర్యగ్రహణం ముగిసింది. హైబ్రిడ్ సూర్యగ్రహణం నుండి తాజా చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసాధారణమైన అరుదైన "హైబ్రిడ్" వార్షిక-పూర్తి సూర్యగ్రహణం  సంపూర్ణ గ్రహణం లేదా కంకణాకార గ్రహణం వలె కనిపించింది. 
 
ఆస్ట్రేలియా, పశ్చిమ తీరం నుండి దీనికి "నింగలూ" అని పేరు పెట్టారు. ఇక్కడే ఈ సూర్యగ్రహణం బాగా కనిపించింది. కానీ గ్రహణం మూడు గంటల తర్వాత, సూర్యుడి పూర్తి రూపం ఆస్ట్రేలియాతో పాటు ఇతర ప్రాంతాలలో పూర్తిగా కనిపిస్తుంది. 
 
దురదృష్టవశాత్తు, భారతదేశంలోని వీక్షకులకు గ్రహణం కనిపించలేదు. అయితే ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్కైవ్ చేసిన లైవ్ స్ట్రీమ్ క్రింద, గ్రహణంకు సంబంధించిన కొన్ని తాజా చిత్రాలు, వీడియోలను కూడా చూడవచ్చు.