నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం - 3 వాహక నౌక
ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఎల్‌వీఎం-3 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 24.30 గంటల పాటుకొనసాగింది. ఉదయం 9 గంటలకు వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం-3 వాహక నౌక తీసుకెళ్లింది.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌వెబ్‌తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను పంపింది.