సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (12:00 IST)

కేరళలో ఘోరం.. ఐదుగురు ఇస్రో ఉద్యోగుల దుర్మరణం

road accident
కేరళ రాష్ట్రంలోని అళప్పుళా జిల్లాలో ఘోరం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇస్రో ఉద్యోగుల దుర్మరణం పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
సోమవారం తెల్లవారుజామున బియ్యపు బస్తాల లోడుతే ఏపీ నుంచి అలప్పుళకు వెళుతున్న లారీ ఒకటి ఇస్రో సంస్థకు చెందిన ఉద్యోగులు వెళుతున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయినా వారంతా తిరువనంతపురంలో ఇస్రో క్యాంటీన్‌ ఉద్యోగులుగా పోలీసులు భావిస్తున్నారు. 
 
వీరు ఓ కారులో అలప్పుళ నుంచి తిరువనంతపురంకు వెళుతుండగా కారును బియ్యపు బస్తాల లోడుతో వచ్చిన కారు ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.