గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (11:50 IST)

ఇస్రో ఖాతాలో మరో విజయం, ఎస్ఎస్ఎల్‌వి-డి2 ప్రయోగం సక్సెస్

ISRO
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించిన ఎస్ఎస్ఎల్‌వి-డి2 ప్రయోగం సక్సెస్ అయ్యింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఈ రాకెట్ దూసుకెళ్లింది. ఆపై రాకెట్ మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 
 
తొలి ఉపగ్రహమైన ఈవోఎస్-07ను 785 సెకన్లకు, రెండోదైన జానుస్-1ను 880 సెకన్లకు, చివరిదైన ఆజాదీ‌శాట్‌ను 900 సెకన్లకు వరుసగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలోని ఈవోఎస్-07 ఉపగ్రహాన్నిఇస్రో రూపొందించింది. దీని బరువు 156.3 కేజీలు. 
 
అలాగే ఆజాదీశాట్-2 ఉపగ్రహాన్ని చెన్నై స్పేస్‌కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు రూపొందించారు. దీని బరువు 8.7 కేజీలు. ఇక జానుస్-1ను అమెరికాకు చెందిన అంటారిస్ సంస్థ అభివృద్ధి చేసింది.