గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

గగనయాన్ ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తి...

parachute test
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వచ్చే యేడాది గగనయాన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇందుకోసం వివిధ రకాలైన ప్రయోగాలను వరుస క్రమంలో నిర్వహిస్తుంది. తాజాగా వ్యోమగాములను అంతరిక్షం నుంచి భూమికి తీసుకొచ్చే పారాచూట్‌లను పరీక్షించింది. 
 
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝూన్సీ జిల్లాలోని ఫీల్డ్ ఫైర్ రేంజ్ వద్ద దాన్ని క్రూడ్ మాడ్యూల్ డీసెలరేషన్ సిస్టంకు చెందిన ఇంటెగ్రేటెడ్ మెయిన్ పారాచూడ్ ఎయిర్ డ్రాఫ్ టెస్ట్‌ను నిర్వహించింది. 
 
అయితే, ఈ ప్రయోగంలో భాగంగా, క్రూ మాడ్యూల్ బరువుకు సమానమైన 5 టన్నుల డమ్మీ బరువును భారత వైమానిక దళానినికి చెందిన ఐఎల్ 76 విమానం ద్వారా 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు జారవిడిచారు. ఆ తర్వాత ఈ మాడ్యూల్ సురక్షితంగా భూమిపైకి ల్యాండ్ అయింది.  
 
శనివారం చేపట్టిన ఈ ప్రయోగం రెండుమూడు నిమిషాల పాటు కొనసాగింది. పేలోడ్‌ బరువు నేలపై మృదుగువా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో మెయిన్ పారాచూట్‌లు పేలోడ్‌ వేగాన్ని సురక్షితమైన వేగానికి తగ్గించినట్టు ఈ పరీక్షలో తేలింది. ఈ పరీక్షతో గగనయాన్ ప్రాజెక్టు ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని ఇస్రో తెలిపింది.