శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (10:51 IST)

ఇస్రో కొత్త ప్రయోగం.. నింగిలోకి ప్రైవేట్ కంపెనీ రాకెట్‌

Rocket
Rocket
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన తొలి రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం అది సముద్రంలో కూలిపోతుంది. ఈ మొత్తం ప్రయోగం 300 సెకన్లలో ముగుస్తుంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ఉదయం 11.30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. హైదరాబాద్‌‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రాకెట్‌ను నిర్మించింది.
 
75 ఏళ్ల తర్వాత స్వతంత్ర భారత చరిత్రలో ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి పంపనుండటం ఇదే తొలిసారని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటమిక్ ఎనర్జీ సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాకెట్ ప్రయోగంలో ఆయన పాల్గొంటారు. ఈ రాకెట్ బరువు దాదాపు 545 కేజీలు.