మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (12:13 IST)

ఎయిర్ టెల్ నుంచి సరికొత్త ప్లాన్.. రూ.199 ధరతో 30 డేస్ వ్యాలిడిటీ

airtel
దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటిగా ఉన్న ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 30 రోజుల కాలపరిమితితో రూ.199కే ఈ ప్లాన్‌ను అందించనుంది. అయితే, ప్లాన్‌ కింద కేవలం 3జీ డేటా మాత్రమే అందిస్తుంది. మొబైల్ వినియోగదారుల్లో పెద్దగా డేటా ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగడపనుంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 300 ఎంఎంఎస్‌లు ఉచితంగా ఇవ్వనుంది. 
 
అయితే, 3 జీబీ డేటా దాటిన తర్వాత ఒక ఎంబీ డేటాను 50 పైసలు చొప్పున చార్జ్ చేస్తుంది. ‌అలాగే, ఎస్ఎంఎస్‌ల పరిధి దాటిన తర్వాత ప్రతి లోకల్ ఎస్ఎంఎస్‌కు రూపాయి చొప్పున చార్జ్ చేస్తుంది. ఎస్టీడీకి అయితే రూ.1.50 చొప్పున వసూలు చేయనుంది. 
 
అయితే, 300 ఎంఎంఎస్‌లు ఉన్నప్పటికీ ఒక రోజులో వంద ఎస్ఎంఎస్‌లకు మించి ఉపయోగించుకోవడానికి వీల్లేదు. సెకండరీ సిమ్ వాడుకునేవారు, డేటా తక్కువగా ఉపయోగిచుకునేవారికి ఈ ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. 
 
కాగా, మరో ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇప్పటికే రూ.199 ప్లాన్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది రోజువారీగా 1.5 జీబీ డేటాతో పాటు ప్రతి రోజు వంద ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.